పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ పథకం పాత బకాయిలను చెల్లించేలా చొరవ చూపాలి
మంత్రి నారా లోకేష్ కు నివేదించిన పంచాయతీరాజ్ ఛాంబర్ సింగంశెట్టి సుబ్బరామయ్య.సింగంశెట్టి ని సత్కరించిన నారా లోకేష్.
మనన్యూస్,తిరుపతి:గత వైసిపి ప్రభుత్వంలో పంచాయతీల నిర్వీర్యం అయిపోయాయి అని,గ్రామ పంచాయతీల అభివృద్ధికి వెంటనే నిధులు మంజూరు చేసేలా చొరవ చూపాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు.ఆదివారం నెల్లూరు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ చంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య కలిశారు.ఈ సందర్భంగా మంత్రికి రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకం సంబంధించిన పాత బకాయిలను వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరారు.వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి ని సింగంశెట్టి సుబ్బరామయ్య శాలువతో ఘనంగా సత్కరించారు.అయితే పార్టీలో సింగంశెట్టి సుబ్బరామయ్య చేస్తున్న సేవలను గుర్తించి తిరిగి అదే శాలువతో మంత్రి నారా లోకేష్ చిరునవ్వులు చిందిస్తూ ఆయనను సత్కరించారు.మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం,తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు,జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి లు ఉన్నారు.