మనన్యూస్,తిరుపతి:నెల్లూరు పర్యటనకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ తిరుపతి కో అపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ గా ఆర్సి ముని కృష్ణను చేయటంలో కూటమి నేతలు అంతా కలిసికట్టుగా పని చేయడం అభినందనీయమని మంత్రి నారా లోకేష్ నాయకులను కొనియాడారు. మంత్రిని కలిసిన వారిలో జేబీ శ్రీనివాస్,అన్నా అనిత,బిజె కృష్ణ యాదవ్,శంకర్ యాదవ్,గంజి సుధాకర్ రెడ్డి ఉన్నారు.