Mana News :- ఒంగోలు. నగరానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నూరు భాషు కాలీషా వలి నీ సంతపేట ఆయన నివాసంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ స్టేట్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మక్కెన సురేంద్రబాబు మాట్లాడుతూ
కాలీషా వలి. చిన్నతనము నుండి మంచి నడవడిక , క్రమశిక్షణతో ప్రాథమిక విద్యను ఆర్. జె హిందు పాఠశాలలో , మాధ్యమిక విద్యను గోరంట్ల వెంకన్న ఎయిడెడ్ పాఠశాలలో స్వగ్రామంలోనే అభ్యసించి, ఒంగోలులోని వెలిది వెంకటేశ్వర్లు అండ్ మంగమ్మ డిగ్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీలు చదివి గిద్దలూరులోని ఆదర్శ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో వృత్తి విద్య అయిన బి.ఇడి పూర్తికావించినారు. అటు పిమ్మట హైదరాబాదు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ఏ. ఎస్సి (గణితం)లో పట్టభద్రులైనారు. బాలలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయ వృత్తి లో 04.08.1989 న స్పెషల్ టీచర్ గా పెదగంజాం, పట్టపు పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేరి సెకండరీ గ్రేడ్ టీచర్ గా పలువురి ప్రశంసలు అందుకున్నారు. 02.11.1990 నుండి 9. 5. 2000 వరకు వెలిగండ్ల మండలం వెదుళ్ళ చెరువు, ఇంకొల్లు మండలం కొణికి, భీమవరం, చిన్నగంజాం మండలం సంతరావూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహించారు. పదోన్నతి పై 10.05.2000 న కొరిశపాడు మండలం రావినూతల జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూలు అసిస్టెంట్ (గణితము) గా బాధ్యతలు స్వీకరించి పమిడిపాడు, కారుమూడి వారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 13.01.2021 వరకు పనిచేసినారు. ఎందరో విద్యార్థులను తమ బోధనలతో గణితంలో నిష్ణాతులుగా తీర్చిదిద్ది ఉత్తమ ఉపాధ్యాయునిగా అసమాన కీర్తిని గడించి గడించినారు. అటుపట 14.01.2021న ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిని పొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండ (ఆర్.ఎస్) లో చేరి తదుపరి పామూరు మండలం కంబాలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ విశిష్ట సేవలు అందించి, ప్రస్తుతం చిన్నగంజాం మండలం రాజు బంగారు పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ పాఠశాల పరిపాలన మరియు విద్యా సంబంధమైన విషయాలలో తమదైన చెరగని ముద్ర వేసి 31.01.2025న పదవీ విరమణ చేసినారు అని వీరి విశిష్ట సేవలు అమోఘమైనవని కొనియాడినారు . నేషనల్ యాక్టివ్ రిపోర్టర్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాదర్ వలీ మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ఈ 36 సంవత్సరాల సుదీర్ఘకాలములో క్రమశిక్షణ అంకిత భావములే ఊపిరిగా సహోపాధ్యాయులు యెడల స్నేహశీలిగా మచ్చలేని చంద్రునిగా మెలిగిన తీరు అందరికీ ఆదర్శమని అన్నారు. 2019లో అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఐ.ఏ.ఎస్. చేతుల మీదగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కాలీషా వలి గారి ప్రతిభకు గీటురాయి అని అన్నారు . ఈ కార్యక్రమంలో స్టేట్ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మక్కెన సురేంద్రబాబు, స్టేట్ సెక్రటరీ షేక్ ఖాదర్ వలి తో పాటు పి. వెంకటేశ్వర్లు, కోటయ్య, రాకేష్ , ప్రకాష్, మొదలగువారు కాలేషా వలి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసినారు.