మన న్యూస్ జిల్లాప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా :- కోడేరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి, కోడేరు మండల కేంద్రంలో పాఠశాల లో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కొరకు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు నిధులు మంజూరు చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ముందుగా మండల కేంద్రంలో ఉన్న భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మంత్రి జూపల్లి నివాళులర్పించారు. కోడేరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 25 లక్షల రూపాయలతో టాయిలెట్స్, డార్మెటరీ హాల్ మరియు డైనింగ్ హాల్ నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కస్తూరిబా గురుకుల పాఠశాలలో 10 లక్షల రూపాయలతో నిర్మించబోయే అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. కోడేరు మండలం కోండ్రావుపల్లి గ్రామంలో SC సబ్ ప్లాన్ నిధులతో 50 లక్షల రూపాయలతో సిసి రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. జనుంపల్లి గ్రామంలో 16 లక్షల రూపాయలతో నిర్మించబోతున్న సిసి రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, చదువు ఒక్కటే విద్యార్థులకు భవిష్యత్తును ఇస్తుందని మంత్రి జూపల్లి గారు అన్నారు.