మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రతిపాడు నియోజక వర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి గ్రామంలో, ఏలేశ్వరం మండలం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీఏ శ్రేణులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక సచివాలయాలు, స్థానిక పాఠశాలలో, ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో కరపత్రాలు పంచుతూ, గ్రాడ్యుయేట్ ఓటర్లను ఓట్ల అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి నుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న పేరాబత్తుల రాజశేఖరం కీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారితో గెలిపించవలసిందిగా కోరుచున్నాము . ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు బుద్దా ఈశ్వరరావు, ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు