మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి1974 అక్టోబర్ 12న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు తన 50 ఏళ్ల అర్ధ శతాబ్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకుంది.2013లో రెండుగా చీలిన పిడిఎస్ యు,ప్రస్తుతం రెండు కార్యవర్గాలు నెల్లూరు నగరంలో ఈనెల 14న విలీన సభ నిర్వహిస్తున్నామని,జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం శ్రీకాళహస్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దా పోస్టర్లు ఆవిష్కరణ నిర్వహించారు.ఈ సందర్భంగా పిడిఎస్ యు డివిజన్ నాయకుడు.మణి మాట్లాడుతూ పిడిఎస్ యు సంఘం చరిత్రలో ఇదిక చారిత్రాత్మకమైన సందర్భం అన్నారు.ఈ ఐక్యత దేశంలో ఉన్న మరిన్ని విప్లవ విద్యార్థి సంఘాల ఐక్యతకు తోడ్పాటున అందిస్తుందన్నారు.దీని ద్వారా దేశంలో బలమైన బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు.దేశంలో నిరుద్యోగం,అవినీతి పెరిగిపోయిందన్నారు.యూజీసి నియమ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకొని విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద శక్తులుగా నిలయాలుగా మార్చేందుకు కుట్ర చేస్తుందన్నారు. కావున నెల్లూరు నగరంలో 14న జరిగే పిడియస్ యు సంస్థల విలీన సభక విద్యావంతులు మేధావులు విద్యార్థులు యువత ప్రజాస్వామ్యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మణి.ప్రశాంత్.బాలు తదితరులు పాల్గొన్నారు.