మనన్యూస్,పాచిపెంట:రైతుల విశిష్ట సంఖ్య తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల వద్ద ప్రతి రైతు తన విశిష్ట సంఖ్యను పొందాలని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు.బుధవారం నాడు మండలం కర్రివలస,విశ్వనాధపురం రైతు సేవా కేంద్రాలలో రైతుల విశిష్ట సంఖ్య నమోదు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఎరువులు విత్తనాలు పంటల భీమా పంట రుణాలు సున్నా వడ్డీ పథకాలు వంటి అన్ని వ్యవసాయ పథకాలు పొందాలంటే ప్రతీ రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని విశిష్ట సంఖ్యను పొందాలని కోరారు.చాలామంది రైతులకు ఆధారతో అనుసంధానించబడిన ఫోన్ నెంబర్లు లేవని రైతులు తప్పనిసరిగా మీసేవ సెంటర్లకు లేదా ఆధార్ సెంటర్ కి వెళ్లి తమ మొబైల్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకుని తమ యొక్క వన్ బి మరియు ఆధార్ నెంబర్లను తీసుకొని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని ఒకటి రెండు నిమిషాలలోనే విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని కాబట్టి రైతులు తమ బాధ్యతగా రైతు సేవా కేంద్రాలకు వెళ్లాలని కోరారు.ఈ విషయమై గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలని గ్రామ వ్యవసాయ సహాయకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మోహన్ కృష్ణ,మోహన్ కుమార్ పాల్గొన్నారు.