మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :మండలంలోని ఒమ్మంగి గ్రామనికి చెందిన కొప్పన బాబురావు భార్య ను కాకినాడ మెడికవర్ హాస్పిటల్ లో పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు ఈ సందర్భంగా వైద్యుల్ని కలిసి మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని అన్నారు.అనంతరం ధర్మవరం గ్రామంలో ధారా కుమారి కుమారుడు కాలు ఆపరేషన్ చేయించుకున్నారని విషయం తెలుసుకుని వారిని కూడా పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకొని ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో బొల్లు నాగేశ్వరరావు,జువ్వల దొరబాబు, దెందుకూరి హరిరాజు,శ్రీను కళ్యాణ్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.