
మనన్యూస్,పాచిపెంట:చౌకు భారు విమర్శలు మానుకొని నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖీ సూర్యనారాయణ ప్రతిపక్ష నాయకులైన మాజీ ఉప ముఖ్యమంత్రి పి రాజన్న దొరను కోరారు.మంగళవారం నాడు మండలం పి కోనవలస గ్రామం టీడీపీ నాయకులు కొట్యాడ సత్యనారాయణ ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు.మీరు నాలుగు సార్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గా అయ్యారు.మీరు చెయ్యని అభివృద్ధి ఈ ఏడు నెలల్లో జరిగిందని సూర్యనారాయణ ఆరోపణలు చేశారు.రాజకీయాలకు అతితంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రతి పక్ష నాయకులు సహకరించాలి తప్ప అభివృద్ధి పై ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు.ఇటీవల జరిగిన శంబర జాతర రాష్ట్రమంతా హర్శించే విదంగా జరిపారని,ఆమెను విమర్శించే హక్కు లేదన్నారు. మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పాంచాలి సర్పంచ్ జి యుగంధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో మంత్రి సంధ్యారాణి అభివృద్ధిని శరవేగంగా జరిపిస్తున్నారని,ప్రజలు కోసం వారి సమస్యలు పరిస్కారం కోసం ఎల్ల వేళలా అందుబాటులో ఉంటున్నారని గుర్తు చేసారు.ప్రజలు శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు నాయుడు,మంత్రి సంధ్యారాణి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.మౌళిక సదుపాయాలు కల్పన లో ముందున్నారని తెలిపారు.రాజన్న దొర తప్పుడు విమర్శలు తాగవు అన్నారు.నియోజకవర్గం లో రహదారులు నిర్మాణం యుద్ధప్రతిపదికన కొనసాగుతున్నాయని తెలియ జేశారు.రాజన్న దొర ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.పనులు జరగకపోతే ప్రజలు తరుపున పోరాటం చేయాలి తప్ప ఓర్వలేక చౌకు బారు విమర్శలు మానుకోవాలన్నారు.తప్పుడు విమర్శలు చేస్తే గట్టిగా సమాధానం చెబుతామన్నారు.1/70 చట్టం లో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయదని,ప్రజలును తప్పు దోవ పట్టించడం పనిగా రాజన్న దొర కంకణం కట్టుకున్నారని విమర్శించారు.వీరితో పాటు పాచిపెంట ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు,మోసూరు కనక,మతల బలరాం,కే సత్యనారాయణ,పూసర్ల నరసింగ రావు,ఎం మజ్జరావు,మోసూరు సింహాచలం,తదితరులు హాజరయ్యారు.