మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం ఆరిమాకులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్ఆర్ పురం జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో జాతీయ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మోహన్ మురళి మాట్లాడుతూ విద్యార్థులకు జాతీయ డి వార్నింగ్ డే సందర్భంగా నులిపురుగుల నివారణ మందులను అందించడం జరిగిందన్నారు. అనంతరం నులిపురుగుల నివారణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లోకనాథం పిళ్ళై, ఎంఈఓ సబర్మతి మెడికల్ ఆఫీసర్ గిరిధర్ రెడ్డి, బాలసుబ్రమణ్యం రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.