తవణంపల్లి ఫిబ్రవరి 10 మన న్యూస్
ఆల్బెండజోల్ 400 మి. గ్రా. మాత్ర తో నులి పురుగుల నిర్మూలించడం సాధ్యమవుతుందని తవణంపల్లి మండలం ఎంఈఓ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన ఉద్దేశించి మండల విద్యాశాఖ అధికారి హేమలత మాట్లాడుతూ పిల్లలు, కిషోర బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పిల్లలలో కనిపించే లక్షణాలు పోషకాహార లోపం, రక్తహీనత, నీరసంగా ఉండడం, శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపాలు కలిగి ఉండడం, జరుగుతుందని తెలిపారు. అనంతరం అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబడే ఆల్బెండజోల్ 400 మి. గ్రా. మాత్రతో నులిపురుగుల నిర్మూలన చేపట్టవచ్చుని తెలిపారు. అనంతరం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగింది. బడికి హాజరుకాని పిల్లలకు తిరిగి ఫిబ్రవరి 17వ మాత్రలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.