జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ఏలూరులో సోమవారం నామినేషన్ వేస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నియోజకవర్గ కూటమి శ్రేణులతో 50 కార్లలో ర్యాలీగా బయలు దేరి వెళ్ళారు.కూటమి శ్రేణులతో కలిసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు.ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని,రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.యువత భువిస్యత్ కోసం, ఉపాధి అవకాశాలు కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.