క్రమశిక్షణ నిజాయితితో విధులు నిర్వహించాలి-స్టేషన్కు వచ్చిన బాదితులకు భరోసా ఇవ్వాలి.
మనన్యూస్,కామారెడ్డి:- పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని,పొలిసు డ్యూటీ లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని,బాధతో పోలీసు స్టేషన్కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపిఎస్ గారు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో నూతనంగా వచ్చిన పోలీస్ సివిల్ కానిస్టేబుల్ లకు జిల్లా పోలీస్ కార్యాలయంలో రెండు రోజులపాటు శిక్షణ డి,ఎస్,పి సి,ఐ,ల తొ శిక్షణ ఇవ్వడం జరిగింది కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ లో పోలీస్ స్టేషన్లో విధులు ఎలా నిర్వర్తించాలి,ప్రజలతో ఎలా మెలగాలి,బందోబస్తు డ్యూటీ కి వెళ్ళినప్పుడు డ్యూటీ ఎలా చేయాలి,ట్రబుల్ మాంగర్లతోటి మరియు ప్రజలతో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలపై సీనియర్ అధికారులతో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది.