మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ వారి ఆదేశాలతో,కాకినాడ ఏఎస్ పి మనీష్ దేవరాజ్ పాటిల్ ఉత్తర్వుల మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు సిబ్బంది తో కలిసి గొల్లప్రోలు గ్రామ శివారు ఏలేరు కాలువ పక్కన పంట కాలువ గట్టు పై జరుగుచున్న పేకాట శిబిరం పై దాడి నిర్వహించి 6 గురు వ్యక్తులను అదుపులో తీసుకుని వారి వద్దనుంచి 1,78,840/రూపాయలు స్వాదినం చేసుకున్నారు
కేసు నమోదు చేసి గొల్లప్రోలు ఎసై రామ కృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.