
Mana News :- నిన్న హైదరాబాదులో జరిగినటువంటి అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా టీవీ రంగాలలో పలు విభాగాలలో అందించినటువంటి అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా విలక్షణ దర్శకుడు నిత్య ప్రయోగశీలి డాక్టర్ పిసి ఆదిత్య కు ఉత్తమ నటుడు అవార్డును ప్రధానం చేశారు వంశి టీవీ మరియు మోర్డు సంస్థల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు మాజీ కేంద్రమంత్రి ఎస్ వేణుగోపాల చారి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్త డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్న అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య నటించిన సంచలనాత్మక లఘు చిత్రం వంతు లో ఆదిత్య అసమాన నటన ప్రతిభను గుర్తించి ఉత్తమ నటుడిగా అవార్డును ప్రధానం చేశారు ఆదిత్య శిష్యుడు డాక్టర్ రావుల మోహన్ రెడ్డి దర్శకనిర్మాతగా మారి ఈ వంతు లఘుచిత్రం నిర్మించారు ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో పలు అవార్డులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం పొందింది 22 ఈ సందేశాత్మక లఘు చిత్రంలో ఉన్న ఏకైక పాత్ర కొడుకుల చేతుల్లో మోసపోయిన తండ్రి పాత్ర లో డాక్టర్ పి సి ఆదిత్య అద్భుత నటనను ప్రదర్శించారు ఈ సందర్భంగా అవార్డు అందజేసిన చేసిన అతిథులు కార్యక్రమం నిర్వాహకులు ఆదిత్య అభినందించారు ఈ సందర్భంగా ఆదిత్య స్పందిస్తూ అలుపెరిగిన తన సినీ ప్రయాణంలో నిరంతరం పలు ప్రయోగాలు చేస్తూ ఎందరో నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇస్తున్నానని ఇది తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు భవిష్యత్తులో కూడా తన నిర్మించే చిత్రాలలో లఘు చిత్రాలలో కొత్త వారికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు ఆదిత్య ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సందర్భంగా ఆదిత్య అభిమానులు శ్రేయోభిలాషులు ఆదిత్య అభినందనలు తెలియజేశారు.
