మనన్యూస్,నాదర్గుల్:మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని ప్రెస్ కాలనీలో వి చంద్రశేఖర్ నేతృత్వంలో గ్లాడియేటర్స్ కరాటే తైక్వాండో అకాడమీ ని ముఖ్య అతిథిలుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్,సినీ హీరో ఇంద్రసేన,తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు.సినీ హీరో,వారియర్స్ కరాటే గ్రాండ్ మాస్టర్ ఇంద్రసేన,తైక్వాండో 29 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత గ్రాండ్ మాస్టర్ ఎమ్ జయంత్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రస్తుత సమాజ పరిస్థితులలో మార్షల్ ఆర్ట్స్ విద్యను ప్రతి ఒక్కరూ కచ్చితంగా నేర్చుకోవాలని ముఖ్యంగా అమ్మాయిలు తమపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు మార్షల్ ఆర్ట్స్ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.మార్షల్ ఆర్ట్స్ విద్యపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని తద్వారా ఆత్మ రక్షణతో పాటు క్రమశిక్షణ, పట్టుదల,మానసిక ధైర్యం ఏర్పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్,బడంగ్ పేట్ కార్పొరేషన్ 1,2 అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి,రామిడి వీరకర్ణ రెడ్డి, కె వీణ,వి వర్ష,వి విగ్నేష్,వి శ్రీనివాస్,సుమ, గ్లాడియేటర్స్ కరాటే ఫౌండర్ అండ్ గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ చారి,స్వరూప చారీ, బ్లాక్ బెల్ట్ తేజస్విని,బ్లాక్ బెల్ట్సా యిరాజ్,ప్రీతిక,సదానంద్,శశిధర్,సుభద్ర,వీరన్న, కళావతి,విజయ్ కుమార్,శారద,బాబూరావు, భారతి, రాజు, రాకేష్,సుకన్య కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.