మనన్యూస్,కామారెడ్డి:శ్రీ శబరి మాతాజీ ఆశ్రమ కమిటీ సభ్యులు ఉదయం మెదక్ జిల్లా రంగంపేట లో గల శ్రీ శ్రీ శ్రీ పరివ్రాజక శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారిని తాడ్వాయి ఆశ్రమ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.శ్రీ శ్రీ శ్రీ పరమ హంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరిమాతాజీ 25 వ సం నిర్వికల్ప మహా సమాధి సమారాధన శ్రీరామ నవమి రోజున జరిగే రజతోత్సవ కార్యక్రమానికి స్వామివారిని ఆహ్వానించి వారి యొక్క సూచన మేరకు కార్యక్రమాల నిర్వహణ గూర్చి స్వామివారితో చర్చించడం జరిగినది.ఈ కార్యక్రమంలో వేముల శంకరయ్య, నేతి కృష్ణ మూర్తి, దూడం శ్రీనివాస్,కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,లక్ష్మి నారాయణ భరద్వాజ్,ఇప్పకాయల పండరి,అరిభ బాలకిషన్ రావు,గడ్డం వేణు,ఆకుల రామశంకర్,దేవరెడ్డీ,నేతి నగేష్,గిరిధర్ రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.