మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా,అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల11 తేదీ 12వ తేదీ రెండు 48 గంటలు నిరవధిక మన్యం బందును విజయవంతం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు సూకురు అప్పలస్వామి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి గిరిజనులు నివసిస్తున్న వారికి రాజ్యాంగబద్ధంగా హక్కులు చట్టాలు కల్పించబడ్డాయని గిరిజన ప్రాంత అభివృద్ధికి 1/70 బై చట్టం పెద్ద ఆటంకం అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా సంపదను కలిగి సంపదను తరలించాలని దురుద్దేశంతో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కూటమి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం వైఖరి తెలిపి వన్ బై సెవెంటీ చట్టానికి రక్షణ కల్పించాలని ఏజెన్సీలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలను చట్టం చేయాలని ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని జీవో నెంబర్ 3 ని పునరుద్ధరణ చేసి గిరిజనులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.బందు విజయవంతం కోసం అన్ని గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని కోరారు ప్రజలంతా బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకొని గిరిజనులకు అండగా నిలవాలని లేదంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సూకూరుఎర్రయ్య భీమయ్య కొర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పాచిపెంట మండలం కుడుమూరు మెట్టవలస వద్ద ముందు విజయవంతం కోసం ప్రజలు సహకరించాలని కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు సూకురు అప్పలస్వామి అన్నారు.