మనన్యూస్,సాలూరు:పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో వెంకటేశ్వర కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో 104 యూనియన్ అధ్యక్షులు డర్రు ఆనందరావు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ పార్వతిపురం మన్యం జిల్లాలో 64 మంది 104 డ్రైవర్స్ మరియు డీఈవోలుగా పనిచేస్తున్నారు నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉంటూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్నారు అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తాదనుకుంటే ఇచ్చినటువంటి జీవితంలో1000రు,,కోత పెట్టడం న్యాయం కాదు కావున ప్రభుత్వం ఆలోచించి మా సమస్యలు పరిష్కారం చేయాలి కొత్తగా తయారుచేసినRFP లో డీఈఓ లకు జీతభత్యాలు విషయం ఎటువంటి మార్పు జరగలేదు, అదేవిధంగా స్లాబ్ విషయంలో స్పష్టత లేదు మరియు పిఎఫ్, ఈఎస్ఐ విషయంలో కూడా స్పష్టత లేదు అంతిమంగా CTC అనే పదాన్ని పెట్టి ఉన్నారు దీనివలన యాజమాన్యులు ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తున్నారు కావున కుటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని ఈ క్రింది డిమాండ్స్ పరిష్కారం చేయాలని,104 లో పనిచేస్తున్న డీఈవో మరియు డ్రైవర్ల అందరికీ స్లాబ్ అమలు చేయాలి స్లాబ్ ఆటోమేటిగ్గా అమలచే విధంగా RFP నందు పొందుపరచాలి,104 లో CTC విధానాన్ని రద్దుచేసి EPF లో యాజమాన్యం వాటా యాజమాన్యమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి,ఈఎస్ఐ అనేది RFP లో పొందుపరచాలి,104 ఉద్యోగులందరికీ వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి ప్రభుత్వం నియమకాల్లో ప్రాధాన్యత కల్పించాలి,104 లో పనిచేస్తున్న ఉద్యోగులకు గతంలో మాదిరి ఫుడ్ అలవెన్స్ ఇవ్వాలి,ఈ కార్యక్రమంలో కోసధికారి జగదీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు,వైస్ ప్రెసిడెంట్ కాశీ విశ్వేశ్వరరావు, పృద్వి,ఉదయ్,సుభాని,హరి గోపాల్,కుర్మ రాజు,తదితరులు పాల్గొన్నారు.