మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధూళి భద్ర గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి గేమ్మెల జానకి రావు మాట్లాడుతూ కొట్టియా సరిహద్దు గ్రామాల గిరిజనుల పై ఒడిస్సా ప్రభుత్వం దాడులు చేయడం వేధింపులు దిగడం ప్రభుత్వ కేంద్రాల పైన దాడులు చేయడం గ్రామ అభివృద్ధి పనుల యొక్క సామాగ్రిని ఎత్తుకెళ్లడం గిరిజన కూలీలను నిర్బంధించడం సరికాదని ఒడిస్సా ప్రభుత్వం అధికారులు తీరు మార్చుకోవాలని కోరారు గతంలో దిగుశింబి అంగన్వాడీ కేంద్రం పై దాడి జరిపి సామాగ్రిని ఎత్తుకెళ్లారు మరల నిన్న దూళి భద్ర గ్రామంలో రక్షిత మంచినీరు పథకం కింద నిర్వహిస్తున్న వాటర్ ట్యాంక్ సామాగ్రిని అక్రమంగా ఎత్తుకెళ్లి కూలీలను కొట్టియా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగిందని తెలిపారు ఇటువంటి ఇబ్బందులపై గిరిజనులకు బాసటగా నిలబడి అండగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం సరికాదని తెలిపారు ఒడిస్సా ప్రభుత్వం అధికారులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి గిరిజనులపై దాడులు చేస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే గిరిజనులకు రక్షణగా ఉండవలసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం సరికాదని తెలిపారు వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోటియా సరిహద్దు గ్రామాల సమస్యను పరిష్కారం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఇది రాష్ట్రాలు గిరిజనులకు రక్షణగా ఉండాలని డిమాండ్ చేశారు లేనియెడల గిరిజనులందరిని సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పనకు దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని గిరిజనులకు రక్షణగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు తాడంగి సన్నం చోడిపల్లి రాజు,సుబ్బారావు,బిరుసు, సరుబు,తదితరులు పాల్గొన్నారు.