బంగారుపాళ్యం ఫిబ్రవరి 8 మన న్యూస్
బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పరిధిలో కొత్తపల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి క్రింద కొన్ని నెలలుగా ఒక అనాధ వృద్ధుడు గాలికి,వానకు,ఎండకు ఇబ్బంది పడుతూ ఉండేవాడు.అతని అవస్థను చూసిన స్థానికులు అమ్మఒడి వ్యవస్థాపకుడు చెరుకూరి పద్మనాభ నాయుడుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే తన బృందంతో అక్కడికి చేరుకొని అతనికి గుండు కొట్టించి స్నానం చేయించి స్థానిక ఉప సర్పంచ్ లోకనాథ నాయుడు,మాజీ సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు,పోలీసుల సమక్షంలో అమ్మఒడి ఆశ్రమానికి తరలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టెస్లా ప్రకాష్,చండిప్రభ,హుసేన్,వాసుదేవ,జరీనా,ఉదయ్,సరోజమ్మ,టిడిపి యువత అధ్యక్షుడు రమేష్,స్థానిక టిడిపి నాయకులు షబ్బీర్,సోము,మహేష్,సమీర్,రాజేంద్ర నాయుడు,రవి,సదకుప్పంహేమచంద్ర స్థానికులు పాల్గొన్నారు.