మనన్యూస్,మీర్పేట్:ప్రియస్ ఆక్వా ఫ్రెష్&ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ఘనంగా ప్రారంభం
మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ లోని స్వాగత్ గ్రాండ్ బిల్డింగ్ లో పి.రామ కృష్ణ నేతృత్వంలో ప్రియస్ ఆక్వా ఫ్రెష్ & ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ని నూతనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి,భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా షాప్ యజమాని పి.రామకృష్ణ మాట్లాడుతూ ఒక వారం రొజుల వరకు 40% డిస్కౌంట్ ను ప్రారంభోత్సవ ఆఫర్ గా ఇస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రియస్ ఆక్వా ఫ్రెష్ డైరెక్టర్,బంధుమిత్రులు పాల్గొన్నారు.