మనన్యూస్,శేరిలింగంపల్లి:మండల పరిధిలోని జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన భూమిని శనివారం టీయూడబ్ల్యూజే శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నాయకులు పరిశీలించారు.జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలంలో కొంతమంది అక్రమంగా ప్రవేశించి గది నిర్మాణం చేపడుతున్నారని తెలుసుకున్న జర్నలిస్టు నాయకులు శనివారం సదరు భూమిని పరిశీలించారు.శేరిలింగంపల్లి మండల పరిధిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారి కృషితో చందానగర్ లోని సర్వే నెంబరు 174 లో ఒక ఎకరా స్థలాన్ని గతంలోనే ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేతుల మీదుగా సదరు స్థలంలో జర్నలిస్టులు ఏడాది క్రితం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కాగా శుక్రవారం ఓ వ్యక్తి సదరు స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి గదినిర్మానం చేపడుతున్నాడని తెలుసుకున్న టియుడబ్ల్యూజే రాష్ట్ర,జిల్లా,ప్రెస్ క్లబ్ నాయకులు వెనువెంటనే స్పందించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి పనులను నిలుపుదల చేయించారు.ఈ మేరకు శనివారం ఉదయం స్థానికంగా పర్యటించి జర్నలిస్టుల ఇంటి స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారి సంకల్పంతో సంవత్సరం క్రితమే జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం చందానగర్ సర్వేనెంబర్ 174లో 1 ఎకరా స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు.సదరు స్థలం చుట్టూ ఫెన్సింగ్,మట్టి ఫిల్లింగ్ పనులను సోమవారం నుండి అధికారికంగా చేపడుతామని తెలిపారు. ఈ విషయమై సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ళ విఠల్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్, సీనియర్ జర్నలిస్టు నాయకులు శ్రీనివాస్ గౌడ్,అశోక్ యాదవ్,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి,కోశాధికారి లక్ష్మీనారాయణ,టెంజు గౌరవ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,టెంజు అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఎండి.ఖదీర్,జర్నలిస్టులు సురేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.