మనన్యూస్,ఎల్,బి,నగర్:ఎల్ బి నగర్ నియోజకవర్గం దిల్సుఖ్నగర్లోని భవాని నగర్ నివాసి బచ్చు రాజు కు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్,బంజారా హిల్స్ లో అత్యవసర చికిత్స నిమిత్తం ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తాను సంప్రదించారు.ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా వెంటనే స్పందించి తక్షణ వైద్య సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఏడు లక్షల రూపాయలు మంజూరు చేయవలసిందిగా కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా లేఖ రాశారు.ఈ సందర్భంగా బచ్చు రాజు ఎమ్మెల్సీ దయానంద్ గుప్తాకు తన ధన్యవాదాలు తెలిపాడు.