మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో మారుమోగుతున్న శుక్రవారం రోజు సతీసమేత నవగ్రహ ప్రతిష్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహాల ప్రతిష్ట చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాలకు దాతలుగా ఎందరో నిలిచారని అట్టి దాతలకు అమ్మవారి కృప కటాక్షాలు ఉండాలని ఆర్యవైశ్య సంఘం తరఫున అమ్మవారిని వేడుకుంటున్నామన్నారు కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాసవి కుటుంబ సభ్యులు సతీ సమేతంగా పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు మరియు వాసవి ఆర్యవైశ్య సభ్యులు సతీ సమేతంగా అందరూ పాల్గొనడం జరిగింది