మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు మరింత చేరువ కావాలని ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి కే అజయ్ ప్రసన్నకుమార్ జిల్లా కలెక్టర్,కమిషనర్ మౌర్యలను కలిసి కోరారు. శుక్రవారం ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రమోహన్ ఆదేశాల మేరకు తిరుపతిలో జాతీయ కమిటీ సంస్థ కార్యదర్శి అజయ్ ప్రసన్నకుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవతి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్,నగరపాలక కమీషనర్ మౌర్యలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా అజయ్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సామాన్య,మధ్యతరగతి ప్రజల కు ఆంధ్ర లోని కొత్త గవర్నమెంట్ అందించే పథకాలు సక్రమంగా అందేలా చూడాలని,పలు అభివృద్ధి కార్య క్రమాలులో జిల్లాలోని అందరు అధికారులను ఇన్వాల్వ్ చేస్తూ,ప్రజలు అందరికీ తెలియ పరచాలని ఎఫ్ ర్ టీ ఐ నేషనల్ జాయింట్ సెక్రెటరీ అజయ్ ప్రసన్న కుమార్ వారిని కోరారు.కలెక్టర్ గారితో మాట్లాడుతూ,ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్ ర్ టీ ఐ శాఖ ల ద్వారా చేస్తున్న అవేర్నెస్ కార్య క్రమాలను వివరిస్తూ జిల్లాలోని అన్ని గవర్నమెంట్,అనుబంధ శాఖ అధికారులను ఆర్టీఐ చట్టం ద్వారా ప్రజలకు కావలసిన సమాచారాన్ని నిర్ధారిత సమయంలో అప్లికెంట్స్ కు అందేలా మీరు మరింత చొరవ చూపి ఈ కొత్త గవర్నమెంట్ నిబద్ధతను,గవర్నమెంట్ అధికారులలో ప్రజల పట్ల జవాబు దారి తనాన్ని పెంచాలని కోరారు.మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడుతూ,తిరుపతి పట్టణంలో,రూరల్ లో పలు వార్డ్ ల లోనీ సామాన్య ప్రజలతో కమిషనర్ మౌర్య గారు మమేకం అవుతూ,వారి సమస్యలను,తొందరగా మున్సిపల్ శాఖ సిబ్బంది ద్వారా చేయిస్తున్నందున చాలా వరకు పట్టణంలోనీ పలు వార్డ్ లు,రోడ్ లలో శుభ్రత మెరుగయ్యిందని తెలిపారు.కొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడా,అవినీతి లేకుండా వారి డ్యూటీ లు చేసేలా కమిషనర్ గారు అబ్జర్వేషన్ లో వుండాలని తెలపటం జరిగింది.ఈ సమావేశంలో రాజ్యాంగ చట్టాలతో కూడిన ఫోరమ్ ఫార్ ఆర్టీఐ నూతన పుస్తక ప్రచురణను,నూతన కాలెండర్ ను వారు ఇరువురికి అందచేయటం జరిగింది.కార్యక్రమంలో ఎఫ్ ర్ టీఐ నాయకత్వాలు, జిల్లా అధికార ప్రతినిధి డి.కరాటే చంద్ర శేఖర్,జిల్లా జనరల్ సెక్రటరీ బి.వెంకట్,జిల్లా మహిళా ప్రెసిడెంట్ జీ.సూర్య కుమారి,జిల్లా జాయింట్ సెక్రటరి కె.అనిల్ కుమార్ తిరుపతి పట్టణ వివిధ శాఖల సెక్రటరీలు శివ,వేణు గోపాల్,పట్టణ మహిళా నాయకత్వాలు షోభావతి,సుజాత,పుత్తూరు,నగరి నియోజకవర్గం అధ్యక్షులు జయలక్ష్మి,జిల్లా ఆక్టివ్ కమిటీ మెంబెర్స్ ప్రవీణ్,రాణి,రాధిక,లక్ష్మి,బాబు పాల్గొన్నారు.