మనన్యూస్,తిరుపతి:నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గుండ్రాజు సుకుమార్ రాజు శుక్రవారం మధ్యాహ్నం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా తిరుపతిలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దీనికి ఆర్ సి మునికృష్ణ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనను,సనాతన ధర్మాన్ని, హిందూ భావజాలాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు తీసుకు వెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసి తన వంతు సాయం అందిస్తామన్నారు.తిరుపతి నుంచి అయోధ్య వరకు జరిగే శ్రీరామ రథయాత్ర పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీవారి పాదాల చంద నుంచి ప్రారంభం కావడం,దీనికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యఅతిథిగా రావడం తిరుపతి కే కాదు తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం అన్నారు. భారతదేశ ఔన్నత్యానికి,హిందూ సంస్కృతి సాంప్రదాయాల సముచిత స్థానానికి భారతదేశం పెట్టిన ఇల్లు అన్నారు.భరతమాతగా ఖ్యాతి గడించే మన మాతృభూమి ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమని వారు పేర్కొన్నారు.