మనన్యూస్,పినపాక:కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందని జనవరి 26వ తారీఖున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన రైతు భరోసా పథకం ద్వారా ఎకరం భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలలో నగదును జమ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం అన్నారు.బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకుల మోసపూరిత వాగ్దానాలు,మాయమాటలను నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వ పాలనలో ఎంత నష్టపోయారో అందరికీ తెలుసని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ పెద్దలు పనిచేస్తున్నారని,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక సైనికుడు లాగా పనిచేసి ఆ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు.
ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పథకాలైన ఇందిరమ్మ ఇల్లు,రైతు భరోసా,నూతన రేషన్ కార్డులు, రైతు ఆత్మీయ భరోసా పథకాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు.రైతు భరోసా పథకం క్రింద ఒక ఎకరం కలిగిన రైతులకు ఐదో తారీఖు నాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి పంపించడం జరిగిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె మదర్ సాహెబ్,నవాజ్ శ్రీను,కొండేరు సంపత్,అర్జున్,సీతయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.