వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి మరియు చవటకుంట గ్రామానికి మధ్య లో గల దారి యందు 03-02-2025 వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి మోటార్ సైకిల్ పై వెళ్తున్న సమయంలో బీరు బాటలతో దాడి చేసిన వారిని విషయమై అదే రోజున వెదురుకుప్పం పోలీస్ సషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో సంబంధించిన ముద్దాయిలు అయినటువంటి రజనీకాంత్ బ్రాహ్మణపల్లి హరిజనవాడ గ్రామం, పవన్ మారేపల్లి హరిజనవాడ గ్రామం, మహేష్ చింతలకుంట గ్రామం మరియు చవటకుంట హరిజనవాడికి చెందిన గణేష్ అనే వ్యక్తులు అందరూ కలిసి బీర్ మద్యం బాటిల్ తో దాడి చేసి గాయపరిచిన వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ హనుమంతప్ప ,ఎస్సై వెంకటసుబ్బయ్య తెలియజేశారు.అదేవిధంగా మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేపడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గాయపడిన వ్యక్తి శంకర్ రెడ్డి