మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్లో బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యం,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఆమోదమును పురస్కరించుకొని స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి.స్వీట్ పంచిపెట్టిన మాదిగలు.ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్లో సమావేశమైన ఎస్సీ కాలనీవాసులు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీవాసులు మాట్లాడుతూ.30 దశాబ్దాల మాదిగల పోరాట కళ ప్రజా ప్రభుత్వ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో,ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ సంపత్ కుమార్ నాయకత్వం లో.వర్గీకరణ ఆమోదం కళ నెరవేరడం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణను,నిన్నటి అసెంబ్లీ సమావేశంలో ఆమోదించడం జరిగిందని ప్రజలకు తెలిపారు.అందుకు గాను రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులాలు ప్రజాసంఘాలు,ప్రజలు ఎంతగానో హర్షిస్తున్నారని తెలిపారు.2016 డిసెంబర్ లో అప్పటి ఎమ్మెల్యేలు ఇప్పటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్,సండ్ర వెంకట వీరయ్య అప్పటి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పై పోరాటం చేశారని అప్పుడు వారిని సస్పెండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు.మరియు అంతేగాక రాహుల్ గాంధీ దురదృష్టితో చేపట్టిన కులగణతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాదిగ సోదరులు పాల్గొన్నారు.