ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కి మేళతాళాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన మీడియా ప్రతినిధులు.
మన న్యూస్,గూడూరు:ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటు కార్యక్రమం బుధవారం గూడూరు రెండవ పట్టణం లోని కాస్మోపాలిటన్ క్లబ్ లో వైభవంగా జరిగింది.మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటు గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పూర్తి సహాయ సహకారాలతో,అంగరంగ వైభవం గా జరిగింది.గూడూరు నియోజకవర్గం లోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమం కి ముఖ్య అతిధిగా విచ్చేసిన గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ని శాలువా తో సత్కరించి,బాణా సంచా పేల్చి,మేళతాళాలతో స్వాగతం పలికిన గూడూరు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు.గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ,గూడూరు లో నూతన ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం చాలా సంతోషం దాయకం అన్నారు.నూతన కార్యవర్గం కి ప్రత్యేకంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈరోజు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం లో చాలామంది నేను గతం లో ఎమ్మెల్యే గా,ప్రస్తుతం ఎమ్మెల్యే గా గెలవడానికి ప్రముఖ పాత్ర పోషించారు అన్నారు.నేను అప్పుడు ఇప్పుడు ఒకేమాట చెబుతున్న, జర్నలిస్ట్ ల కష్టాలు నాకు పూర్తిగా తెలుసు అని,మీ అందరికీ నేను ఎమ్మెల్యే గా ఉన్న కాలంలోనే మీ అందరికీ ఇళ్ళు కట్టించుకునేలా నా పూర్తి సహాయం అందిస్తాను అని తెలిపారు.ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం లోని ప్రతీ ఒక్కరికి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు.టీడీపీ నాయకులు కనుమూరు హరి చంద్రారెడ్డి మాట్లాడుతూ,గూడూరు లో ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేయడం చాలా సంతోషం గా ఉందని,వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ని అసోసియేషన్ సభ్యులు ఘనంగాశాలువాలతో,సత్కరించారు.పూల చెట్లు బహుకరించడం జరిగింది.కార్యక్రమం కి విచ్చేసిన టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులను మీడియా కార్యవర్గం నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం నూతన కార్యవర్గం ని వారి వారి కుటుంబ సభ్యులసమక్షంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ సన్మానించారు.దాదాపు 500మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, జిల్లా నాయకురాలు గుండాల భారతి,సీనియర్ నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి,రహీమ్ భాయ్,చిన్న వైయస్సార్,నెలకాస్ట్ శివ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ముమ్మడి వెంకటేశ్వర్లు యాదవ్,వాటంబేడు శివకుమార్,జిల్లా అట్రాసిటీ మెంబెర్ పెంచలయ్య, మీడియా అసోసియేషన్ అధ్యక్షులు రఘు,గౌరవ అధ్యక్షులు అల్తాఫ్,గౌరవ సలహా దారులు కల్లూరు దయాకర్,మీజూరు మల్లికార్జున రావ్,ఉపాధ్యక్షులు సతీష్,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు,సహాయ కార్యదర్శి పాశిం రవి కుమార్, ట్రెజరర్ అనీల్ కుమార్,న్యాయసలహా దారులు పాలేపు రమేష్,కార్యవర్గం సభ్యులు ప్రభాకర్,వెంకటేష్,ఉదయ్,ఖాదర్,తలారి నాగరాజు,కృపానిధి,వెంకటయ్య,నాగరాజు,రాజ్ న్యూస్ ప్రతినిధి హరికృష్ణ పాల్గొన్నారు.