మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆత్మీయ భరోసాలో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని 560 మంది ఆత్మీయ భరోసా కు అర్హులని ఏపీవో శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఆత్మీయ భరోసాలో ఉన్న వారి పేర్లను చదివి గ్రామసభలో వినిపించడం జరిగిందని అన్నారు. 2023 - 2024 సంవత్సరంలో కనీసం 20 రోజులు పని దినాలు చేసి జాబ్ కార్డు ఉండి వారికిపై ఎలాంటి పొలం లేకుంటే మాత్రమే ఆత్మీయ భరోసాకు అర్హులు అని అన్నారు.560 మందిని మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని ఏపీవో అన్నారు. ఆత్మీయ భరోసాకు జాబ్ కార్డు ఉండి 20 రోజులు పని దినాలు చేసి ఉంటేనే మాత్రమే దీనికి రేషన్ కార్డుతో సంబంధం లేదన్నారు.ఈ కార్యక్రమంలో టిఏలు చంద్రశేఖర్, ప్రభాకర్,బాల్ సింగ్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.