మనన్యూస్,కామారెడ్డి: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలో,ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు,పట్టణ ఎస్సై శ్రీరామ్ మరియు సిబ్బంది అట్టి స్థలానికి వెళ్ళగా,అక్కడ ఒక వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతూ,వేరొక వ్యక్తికి ఒక కవర్ నీ అందించడం గమనించిన ఎస్ఐ మరియు సిబ్బంది,ఆ ఇద్దరినీ పట్టుకుని,పంచుల సమక్షంలో విచారణ చేయగా,ఆ కవర్లలో ఉన్నది గంజాయి అని తెలపడముతో,వెంటనే ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని,వారి వద్ద ఉన్న గంజాయిని తూకం వేయగా అది 380 గ్రాములుగా ఉండటంతో,వెంటనే ఆ ఇద్దరు వ్యక్తులను మరియు స్వాధీన పరుచుకున్న గంజాయితో సహా పీఎస్ కు తీసుకురాగా,విచారణ అనంతరం ఇద్దరిలో ఒకరి పేరు మహమ్మద్ ఇమ్రాన్,వయసు 38 సంవత్సరాలు, నివాసం ఇందిరానగర్ కాలనీ,కామారెడ్డి కాగా,రెండవ వ్యక్తి పేరు షైక్ అన్వర్,38 సం.లు,ఇంద్రానగర్ కాలనీ,కామారెడ్డి అని తెలిసింది.వీరిలో మహమ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి దాదాపుగా చిన్నతనం నుంచి పలు దొంగతనాలు,కొట్లాట కేసులు,ఇతర కేసులలో ఇన్వాల్వ్ అయి జైలుకు పోయి,బయటకు వచ్చి గంజాయిని దూల్పేట ఏరియాలో మరియు ఇతర ప్రాంతాలలో కొనుక్కొని వచ్చి,కామారెడ్డిలో తెలిసిన వారికి,స్నేహితులకు,ఇతరులకు అమ్మి, డబ్బులు సంపాదిస్తున్నాడు.ఇట్టి వ్యక్తికి నేరచరిత్ర ఉండడం వల్ల మరియు ఆరోగ్యానికి హానికరం అయినటువంటి గంజాయిని అమ్ముతూ తాను సేవిస్తూ,ఇతరులకు అమ్ముతూ అతనితోపాటుగా అన్వర్ నీ కూడా గంజాయి అమ్మడానికి వాడుకుంటున్నాడు.ఈ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి గౌరవ న్యాయస్థానం లో హాజరు పరిచి,జైలుకు పంపించడం జరిగింది.కామారెడ్డి పట్టణ ప్రజలకు ముఖ్యమైన విన్నపం ఏమనగా,మీకు గంజాయి గానీ లేదా మరేదైనా మారకద్రవ్యాల కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్లో గాని లేదా డయల్ 100 ద్వారా పోలీసు వారికి తెలియపరచాలని,తద్వారా మాదకద్రవ్యాలను నిరోధించడంలో భాగస్వామ్యం కావాలని కోరడం జరుగుతుంది.