మనన్యూస్,కామారెడ్డి:పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా చౌక్ వద్ద,గత నెల రెండు నెలల నుండి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అధికంగా శబ్ద కాలుష్యాన్ని కలిగించే మోటార్ సైకిల్ యొక్క సైలెన్సర్లను తీసి,వాటి యజమానులపై మోటార్ వాహనాల చట్టానికి అనుగుణంగా కేసులు నమోదు చేసి,అట్టి వాహనాల నుంచి దాదాపుగా 65 సైలెన్సర్లను సీజ్ చేయగా,వాటిని ఎఎస్పీ చైతన్య రెడ్డి,కామారెడ్డి ఆధ్వర్యంలో,రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయడం జరిగింది.తదుపరి ఏఎస్పీ చైతన్ రెడ్డి మాట్లాడుతూ అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సెర్ లను వాడటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని,శబ్ద కాలుష్యం చేయకూడదని చెపుతూ,ఇకమీదట పట్టణములో గాని,ఇతర ప్రాంతాలలో గాని అధిక శబ్ద కాలుష్యాన్ని కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వాడిన యెడల వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి,ఎస్ఐ శ్రీరామ్,ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.