మనన్యూస్,తిరుపతి:శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగ పరిశోధక విద్యార్థిని ఎస్.శృతి డాక్టరేట్ పొందారు.యాన్ ఎఫీషియంట్ అప్రోచ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫైర్ యూజింగ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్'అంశంపై సిద్దాంత గ్రంథాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు ప్రొఫెసర్ బి.అనురాధ పర్యవేక్షకులుగా వ్యవహరించారు.శృతి రూపొందించిన ఐదు పరిశోధనా వ్యాసాలు ప్రముఖ జర్నల్స్ ప్రచురితమయ్యాయి.రెండు అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు.ఫైర్ డిటెక్షన్ అంశంపై రాసిన పరిశోధనా వ్యాసానికి పాండిచ్చేరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తమ పరిశోధనా పత్రం అవార్డు ఇచ్చారు.ఈ మేరకు ఎస్వీయూ పరీక్షల అధికారి దామ్లా నాయక్ తెలిపారు.