మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మదనగర్ మండలంలోని గాలిపూర్ గ్రామనికి చెందిన టెక్కలి నాగరాజు నిన్న రాత్రి మద్యం త్రాగి అనవసరంగా 100 డయల్ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగ పరిచినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ శివకుమార్ తెలిపారు. మళ్లీ 100 డైల్ ను దుర్వినియోగ పరచకుండా ఉండే అందుకోసం తహసీల్దార్ సావాయిసింగ్ ఎదుట హాజరు పరచి.మళ్ళీ దుర్వినియోగం చేయకుండా 1లక్ష రూపాయల పూచీకత్తు చెల్లించే విధంగా బైండోవర్ చేయడం జరిగిందన్నారు.
100 డయల్ ను ఎవరు దుర్వినియోగం చేయకుండా అందరూ కూడా సేవలు వినియోగించుకోవాలని కోరారు.