తవణంపల్లి ఫిబ్రవరి 3 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ నల్లపరెడ్డి పల్లి గ్రామంలో కే.రమేష్ వయస్సు (47) సంవత్సరములు, ఆకస్మికంగా మృతి చెందారు. ఆకస్మికంగా మృతి చెందిన కె. రమేష్ మరణ వార్త తెలుసుకున్న జీ. కరీం రమేష్ కుటుంబానికి భరోసాగా అందుబాటులో లేకపోయినా నల్లపరెడ్డిపల్లి వార్డ్ మెంబర్ ఎస్.నాగరాజు ద్వారా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించారు .అలాగే పైమాఘం గ్రామస్తుడు లైన్ ఇన్స్పెక్టర్ టి. కుమార్ కూడా రమేష్ మరణ వార్త విని రమేష్ కుటుంబానికి 5000=00 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మొత్తం 10,000=00 రూపాయలను ,నల్లపరెడ్డి వార్డ్ మెంబర్ ఎస్.నాగరాజు మృతుడు రమేష్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు పి. చెంగయ్య , కె. బాలయ్య, హరి, సుకుమార్, భువనేశ్వర్,మార్కొండయ్య, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. పది వేల రూపాయల ఆర్ధిక సహాయం అందుకున్న రమేష్ కుటుంబ సభ్యులు జీ. కరీం, మరియు టి కుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.