మనన్యూస్,తిరుపతి:తిరుపతిలో రౌడీయిజాన్ని కాంగ్రెస్,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెంచి పోషించింది కరుణాకర్ రెడ్డేనని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు.కరుణాకర్ రెడ్డి నియంతృత్వ పోకడలను భరించ లేకనే వైసిపిని కార్పోరేటర్లు వీడుతున్నారని ఆయన చెప్పారు.సోమవారం సాయంత్రం తన నివాసంలో మీడియాతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు.డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజార్టీ లేదని ఆరోపిస్తున్న కరుణాకర్ రెడ్డి తన పార్టీకి మెజార్టీ ఉంటే ఎందుకు ఓటింగ్ కు కౌన్సిలర్ లను పంప లేదని ఆయన ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశంకు వెళ్ళుతున్న తమను ఎస్వీ యూనివర్శిటీ సమీపంలో అడ్డుకుని దౌర్జన్యానికి వైసిపి నాయకులు దిగారని ఆయన ఆరోపించారు.వైసిపి నాయకులు దౌర్జన్యం చేస్తే ఎన్డీఏ కూటమి నాయకులు దౌర్జన్యం చేశారని కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారే గాని నాయకులు కాదన్న వాస్తవాన్ని కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు.తనకు గాని తన కుమారుడు మదన్ కు గాని రౌడి మనస్తత్వం లేదని ఆయన చెప్పారు.అభినయ్ రెడ్డిలా మదన్ దౌర్జన్యాలు,గూండా యిజం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో నువ్వు,నీ కొడుకు చేసిన దౌర్జన్యాలకు అధికారులు బలైయ్యారని ఆయన చెప్పారు.త్వరలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నీ ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.మంత్రి అనగాని సత్యప్రసాద్ ను విమర్శించే స్థాయి కరుణాకర్ రెడ్డికి లేదని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు కక్షసాధింపు రాజకీయాలు తమకు నేర్పలేదని ఆయన చెప్పారు.డివిజన్ ల అభివృద్ది కోసం ఎన్డీఏ కూటమిలోకి వైసిపి కార్పోరేటర్లు చేరుతున్నారని,మంగళవారం జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.వైసిపికి చెందిన నలుగురు కార్పోరేటర్లను ఎన్డీఏ కూటమి నాయకులు కిడ్నాప్ చేశారని కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడం దారుణమని టిడిపి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ అన్నారు.నలుగురు కార్పోరేటర్లు తమ బంధువుల ఇళ్లలో సురక్షితంగా ఉన్నట్లు వాళ్ళు విడుదల చేసిన వీడియోను మీడియాకు చూపారు.అసత్య ఆరోపణలు, దౌర్జన్యాలు చేయడంలో కరుణాకర్ రెడ్డి సిద్ధహస్తుడని ఆయన విమర్శించారు.తాను టిడిపి కార్పోరేటర్ ఆర్సీ మునికృష్ణకు ఏ ఫామ్,బి ఫామ్ ఇవ్వడానికి ఎన్నికల అధికారి శుభం బన్సల్ ను కలిసి నట్లు ఆయన చెప్పారు.రాజకీయాల్లో ఏళ్ళతరబడి ఉన్న కరుణాకర్ రెడ్డి కనీస పరిజ్జానం లేకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు.తిరుపతి పవిత్రత, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కరుణాకర్ రెడ్డికి లేదని ఆయన చెప్పారు.కరుణాకర్ రెడ్డి మాటలను తిరుపతి ప్రజలు ఎన్నటికి నమ్మరని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చెప్పారు.ఎన్నికల్లో దౌర్జన్యాలు, అక్రమాలకు పెట్టింది పేరు కరుణాకర్ రెడ్డని ఆమె ఆరోపించారు.ప్రజల అభివృద్ధి కోసం కౌన్సిలర్లు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారని ఆమె చెప్పారు. మంగళవారం జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ గెలవడం ఖాయమని ఆమె తెలిపారు.కాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కరుణాకర్ రెడ్డికి లేదని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు.ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఆయన తెలిపారు.తిరుపతి పవిత్రతపై కరుణాకర్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన హెచ్చరించారు.జిరాక్స్ షాపులో పని చేసిన కరుణాకర్ రెడ్డి తన తండ్రిని,తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే అర్హత లేదని కార్పోరేటర్ అన్నా అనితా అన్నారు.పిచ్చికూతలు మాని గౌరవాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో కిరణ్ రాయల్, కీర్తన,ఆర్పీ శ్రీనివాస్,పొటుకూరి ఆనంద్,రామ్మూర్తి రాయల్,హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.