మనన్యూస్,ఏలేశ్వరం:మాజీ మంత్రి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు శిడగం వెంకటేశ్వరరావు,గొల్లపల్లి సురేష్,తూర్పు లక్ష్మిపురం ఎంపీటీసీ యిజనగిరి లక్ష్మి ప్రసాద్,నాయకులు సుంకర రాంబాబు,వాగు బలరాం,పైల విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.ట్రాక్టరుతో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కారును,ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుందని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.తెలుగు రాష్ట్రాల్లో ముద్రగడ కుటుంబానికి అభిమానులు ఉన్నారని,ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,ఈ ఘటన వెనక ఎవరెవరున్నారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా కోరారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాధ్,వాగు బలరాం,జువ్విన వీర్రాజు,అల్లం ఆదినారాయణ,రాచర్ల రమేష్,గుండుబిల్లి చక్రం,పట్టా సుబ్బారావు,వాడపల్లి శ్రీను,డేగల చంద్ర మౌళి,సిరిపురపు రాజేష్,శిడగం రాజేశ్వరరావు,లోగీసు శేఖర్,ఈపి రాము,పలువురు వైసీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు