చిత్తూరు ఫిబ్రవరి 02 మన న్యూస్
రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) పోరాటాలకు సిద్ధంగా ఉందని రాష్ట్ర నాయకుడు కవరకుంట్ల జయరాజు తెలిపారు ఆదివారం చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవన్ లో చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమిషన్ ను ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్ట్ లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు జిల్లా రాష్ట్ర స్థాయిలో దాడులు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు జర్నలిస్టుల ఐక్యత వారి హక్కుల పరిరక్షణ కోసం చిత్తూరు లో ఫిబ్రవరి చివరి వారంలో జరిగే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లా జయచంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కోశాధికారి అక్రమ్ నిర్వహించారు ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షుడు సాటి గంగాధర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గిరి శేఖర్, కోశాధికారి కృపానంద రెడ్డి, చిత్తూరు జిల్లా నియోజకవర్గ అధ్యక్షుడు ఆలకుంట కేశవులు ప్రధాన కార్యదర్శి బాలసుబ్రమణ్యం హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల జర్నలిస్టుల ప్రతినిధులు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు నియోజకవర్గ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు