మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఉభయగోదావరి జిల్లాల రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గెలిపించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిలుపునిచ్చారు. నగర పంచాయతీ స్థానిక టిడిపి నేత బొదిరెడ్డి గోపి కార్యాలయ లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రసారంలో భాగంగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గ కూటమి శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పోలవరం, అమరావతి, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, మెగా డీఎస్సీ వంటి అంశాల్లో చిత్తశుద్ధితో పనిచేస్తుందని యువత, భావితరాల భవిష్యత్తు కోసం పట్టభద్రులు ఎమ్మెల్సీగా రాజశేఖరం ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, జనసేన జిల్లా నాయకుడు పెంటకోట మోహన్, కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, శ్రీను, నాగబాబు, కోణాల వెంకటరమణ, మాజీ జెడ్పిటిసి జ్యోతుల పెదబాబు, టిడిపి నాయకులు చిక్కాల లక్ష్మణరావు, సూతి బూరయ్య, కూటమి కార్యకర్తలు పట్టబద్రులు పాల్గొన్నారు.