మనన్యూస్,తిరుపతి:యూత్ హాస్టల్ లో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆర్థిక సహకారంతో మహర్షి అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది.అందులో లెమన్ అండ్ స్పూన్ షటిల్ వాలీబాల్ మ్యూజికల్ చైర్స్ వాటిని నిర్వహించడం జరిగింది వీటికి పెద్ద ఎత్తున వివిధ పంచాయతీల నుంచి మరియు మహర్షి అభ్యుదయ సేవా సంస్థలో పనిచేయుచున్న ఉద్యోగులు పాల్గొనడం జరిగినది వీటిలో ఉత్తీర్ణులైన వారిని జిల్లాలో స్పోర్ట్స్ కాంపిటీషన్లో పాల్గొనడానికి అర్హత సాధించినట్లుగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి యూత్ కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ తెలియజేశారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం బ్లాక్ లెవెల్ లో ఉత్తీర్ణత పొందినటువంటి విన్నెర్స్ కి బహుమతులను మరియు ప్రశంసా పత్రాలను యూత్ కోఆర్డినేటర్ ప్రదీప్ గారి చేతుల మీదుగా అందించడం జరిగినది అనంతరం మాస్ సంస్థ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర చిత్తూరు వారి సహకారంతో ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాల నిర్వహిస్తున్నామని వాటిలో ఈ సంవత్సరం ఈనాడు యూత్ హాస్టల్ లో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహించి బహుమతులను అందించినటువంటి నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ప్రదీప్ కుమార్ గారికి మరియు గణాంక అధికారి బాబు రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ అయినటువంటి రన్నర్స్ కి మరియు విన్నర్స్ కి శుభాకాంక్షలు అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో యూత్ హాస్టల్ మేనేజర్ మోహన్ రెడ్డి అవిలాల సర్పంచ్ వెంకటరమణ తదితరులు పాల్గొనడం జరిగినది