మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలలుగా విధ్వంసకర పాలన సాగిస్తుందని అన్నారు.వైసిపి నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని మంత్రి నారాయణ కక్షపూరితంగా కూల్చి వేయడంతో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో అసహ్యం ఏర్పడిందన్నారు.బాలకృష్ణ రెడ్డి కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి న్యాయపోరాటం చేయడమే కాకుండా ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి.తెలుగుదేశం పార్టీ చేస్తున్న కక్ష పూరిత రాజకీయాలను ప్రజలకు వివరించడం జరుగుతుంది అని అన్నారు.నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ప్రజలకు మేలు చేస్తారు అనుకుంటే మంత్రి నారాయణ ఏమి చెప్తారో అదే చేస్తూ నెల్లూరు ప్రజలను ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.నెల్లూరు 51 డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సౌరి కి సంబంధించిన 5 షాపులను మూసి వేయించి 50 కుటుంబాలను రోడ్డును పడవేసి మంత్రి నారాయణ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.ప్రజా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నిస్తే కమిషనర్ కనీసం ఫోన్ ఎత్తి సమాధానం చెప్పే పరిస్థితి లో కూడా లేరని మండిపడ్డారు.పూర్తిగా కార్పొరేషన్ అధికారులు మంత్రి నారాయణ కు దాసోహం అయిపోయారనీ ఆరోపించారు.అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తే ప్రజల నుంచి ఉద్యమం వస్తుందని అన్నారు.గత వైసిపి ప్రభుత్వ హయాంలో మంత్రి నారాయణ కు అధికారులు సహకరించలేదా అని ప్రశ్నించారు.ఈరోజు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని వారు తమ తీరు మార్చుకోవాలన్నారు.
ప్రతిపక్షంలో మంత్రి నారాయణ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా జిల్లా నుంచి పారిపోయారని ఈరోజు బాధ్యత గల ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంటే.తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.