మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఈ నెల 8 స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం ఖాన్ తెలిపారు. ఈ శిబిరంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఇతర ఈ హెచ్ ఎస్ పథకం లబ్ధిదారులకు రాజమండ్రి అకిరా కంటి ఆసుపత్రి వైద్యులు ఉచితంగా పరీక్షలు ఆపరేషన్లు నిర్వహించనున్నారు అన్నారు. ఈ శిబిరంలో కేటరాక్ట్ ఆపరేషన్లు నూతన సాంకేతికతతో సున్నితంగా కోత కుట్లు లేకుండానిర్వహిస్తారన్నారు. ఈ శిబిరానికి ప్రముఖ నేత్ర వైద్యులు హాజరై ఉచిత వైద్యం అందిస్తారని ఈ అవకాశాన్ని ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.