మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: మండలంలోని యర్రవరం గ్రామంలో విఎంఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా దారుల సేవా కేంద్రం సి యస్ పి రమాప్రభ ఆధ్వర్యంలో రైతులు, ఎస్బిఐ ఖాతాదారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యల్ హెచ్ ఓ మేనేజర్ లు సురేష్, ఎలీషా రాయుడు, లుహాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఖాతాదారులతో పలు అంశాలపై చర్చించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కస్టమర్లకు సేవలు మరింత సులభతరం చేసే విధంగా అడుగులు వేస్తోందని తెలిపారు 44 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా ప్రతి వినియోగదారుడు ఉపయోగించుకునే విధంగా ఉందని తెలిపారు రైతుల రుణాలు తో పాటు అన్ని రకాల లోన్లు తదితర లావాదేవీ అంశాలు తెలుసుకొనుటకు 1800 1234 అనే నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా ఖాతాదారులతో తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు మైరాల కనకారావు, తోట వెంకటేశ్వరరావు, తోట దుర్గారావు, తోట గంగాధర్, బీశెట్టి ప్రసాద్, బుద్ధ లోవబాబు,రాయి బాబి, చిలకమర్తి సుబ్రహ్మణ్యం,పలువురు రైతులు యస్ బి ఐ ఖాతాదారులు పాల్గొన్నారు.