మనన్యూస్,తిరుపతి:పుంగనూరు నియోజకవర్గం సోమలలోని జెడ్పీ హైస్కూల్ ను అనుకుని ఆదివారం మధ్యాహ్నం జరిగే జనంతో జనసేన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.శనివారం మధ్యాహ్నం సభ విజయంతంపై తన నివాసంలో జనసేన నాయకులతో ఎమ్మెల్యే సమీక్షించారు.బహిరంగ విజయవంతం అయ్యేలా ప్రతి నాయకుడు తన శక్తి మేర పని చేయాలని ఆదేశించారు.సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ జనంతో జనసేన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పార్టీ ప్రధానకార్యదర్శి నాగబాబు,జనసేన కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వినర్,టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ లు హాజరు అవుతున్నట్లు తెలిపారు.జనంతో జనసేన బహిరంగ సభకు జనసైనికులు,వీరమహిళలు,ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గ ఇన్చార్జీలు తప్పకుండా హాజరు కావాలని కోరారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి జన సైనికుడు ఈ బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాజా రెడ్డి,కిరణ్ రాయల్,నైనర్ శ్రీనివాసులు,కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ,బాబ్జీ,హేమకుమార్,రాజేష్ ఆచ్చారి,మనోజ్,కిషోర్,సాయి,నీలాద్రి,ఆముదాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.