మనన్యూస్,చంపాపేట్:ఆరోగ్యమే మహాభాగ్యం,మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.తేది 1.2.2025 శనివారం ఉదయం 10 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో హీలర్ వేముల విజయలక్ష్మి ,శ్రావణి,మంజుల ల సంయుక్త నేతృత్వంలో ఆక్యుపంక్చర్,నేచురోపతి చికిత్సా విధాన ప్రక్రియ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ శరీరానికి తనకు తానుగా బాగు చేసుకుని గొప్ప శక్తి ఉంటుంది శరీరంలో ప్రాణశక్తి సరిగ్గా ప్రవహిస్తుంటే ఎటువంటి బాధకానీ,జబ్బులుకానీ ఉండవు.శక్తి ప్రవాహంలోని హెచ్చుతగ్గులు ఆక్యుపంక్చర్ చికిత్స ద్వారా బ్యాలెన్స్ అవుతుంది.నాడీ చూసి శరీరం పనితీరును తెలుసుకొని శక్తి ప్రవాహ మార్గాలలో ఉండే కేంద్రాలను సన్నని ఆక్యుపంక్చర్ సూదితో లేదా చేతి వేలికొనతో ప్రేరేపిస్తారు.వ్యాధికి,వ్యాధి మూలానికి చికిత్స జరుగుతుంది.అన్ని వయసుల వారికి అనుకూలం.సాధారణ వ్యాధులే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా చక్కగా నయమవుతాయి అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు యాదయ్య,ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి,కోశాధికారి మాధవరెడ్డి,ప్రభాకర్ రెడ్డి,చంద్రారెడ్డి నవీన్ కుమార్ రాజు భాస్కరా చారి,ఇతర కార్యవర్గ సభ్యులు అర్చన,మహిళా శక్తి సోదరీమణులు పాల్గొన్నారు.