మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి పట్టణం మైనారిటీ నాయకులు షేక్ ఉమ్మర్ ఫరూక్,షేక్ అన్సర్,షేక్ కరీముల్లా,తొట్టంబేడు మండలం నాయకులు పోలి గురునాథం,షేక్ జూమ్లేష కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది,తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి జరగాలన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావడం ఎంతో ముఖ్యమని అదే విధంగా పేద ప్రజల జీవన స్థితిగతులు మారాలన్న అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తద్యమని తెలిపారు,పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి బలం చేకూర్చడానికి తమ వంతు కష్టపడతామని కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చే వరకు ప్రతి ఒక్కరం సైనికుల పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా,ఆంటోనీ,చందు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు