మనన్యూస్,సరూర్ నగర్: మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఏసిపిఎస్ ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సరూర్నగర్ లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి సమర్పించి,ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ప్రసంగించిన ఏసిపిఎస్ వ్యవస్థపక అధ్యక్షులు ప్రేమ్ గాంధీ మహాత్మ గాంధీ చూపిన సత్యం,అహింసా మార్గాలను నేటి యువత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలు,దేశాన్ని స్వతంత్రం చేయడంలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు.సమాజంలోని ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలను అనుసరిస్తే సమాజంలో సామరస్యత,శాంతి,ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడతాయని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర నాయకులు అమర శ్రీనివాస్ గుప్త,చెన్నకేశవులు గుప్త తదితరులు పాల్గొన్నారు