మనన్యూస్,తిరుపతి:గాంధీజీ జీవితం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం షేక్.కరీముల్లా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వకర్త తలపా దామోదర్ రెడ్డి సూచనల మేరకు జాతి పిత మహాత్మాగాంధీ వర్ధంతిని గురువారం కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్.కరీముల్లా మహాత్మాగాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మహాత్మునికి జోహార్లు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీజీ జీవితం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు.ప్రతి సమస్య శాంతి,అహింసతో పరిష్కరించబడాలనే మహాత్ముని ఆకాంక్ష ఎందరికో మార్గదర్శకమన్నారు.మనదేశ స్వాతంత్ర్య సముపార్జనలో మహాత్ముని కృషి అనిర్వచనీయమన్నారు.నిజాయితీతో కూడిన ఆయన పోరాట పటిమ ఎందరిలోనో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిందన్నారు.మహాత్ముని అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను సాధిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవతి,షేక్ అన్సర్,షేక్ జూమ్లేష,షేక్ అస్లం భాష,షేక్ షా హుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.